ఆ క్షణమే మాకు స్టూడియో ఉండాలనుకున్నాను – అల్లు అర్జున్

Allu arjun

స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోలో ఈ వారం గెస్ట్ గా అల్లు అర్జున్ సందడి చేశారు. అయితే షోలో సమంత అడిగిన అనేక ప్రశ్నలకి తనదైన శైలిలో స్టైలిష్ స్టార్ ఆన్సర్స్ ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలో అల్లు స్టూడియో కట్టాలని ఎందుకు అనుకున్నారని ప్రశ్నించగా.. అల్లు స్టూడియో నిర్మాణం వెనుక అసలు కారణాన్ని బన్నీ చెప్పేశారు. ఒకసారి అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో షూటింగ్ ఉండగా తాను లోపలకి వెళ్తూ ఉన్న సమయంలో సెక్యూరిటీ గార్డ్ “వెల్కమ్ టు అన్నపూర్ణ స్టూడియో” సర్ అని అన్నాడని, అప్పుడు మనకి కూడా ఒక స్టూడియో ఉంటే బాగుంటుందని ఆలోచించి నాన్నతో మాట్లాడగా ఆయన కూడా ఒప్పుకోవటంతో అల్లు స్టూడియోను కట్టాలని అనుకున్నామని తెలిపారు.

మూవీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం స్టూడియోల యొక్క అవసరం చాలా ఉంటుంది కనుక లైఫ్ లాంగ్ ఉండే స్టూడియోను నిర్మిస్తున్నామని అయన అన్నారు. అన్ని సౌకర్యాలతో షూటింగ్ లు చేసుకునే విధంగా ఈ స్టూడియో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ స్టూడియో నిర్మాణం కోసం దాదాపుగా వందల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారని సన్నిహితుల నుండి సమాచారం.

Exit mobile version