జనవరి 27 నుండి మళ్ళీ ‘పెళ్లి సందడి’ !

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన అనేక హిట్ సినిమాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. 1996లో వచ్చిన ఈ చిత్రంలో శ్రీకాంత్ హీరోగా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ నందు మార్పులు చేసి ‘పెళ్లి సందడి’ చేస్తున్నారు రాఘవేంద్రరావుగారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ చేయనున్నాడు. అయితే ఈ చిత్రానికి రాఘవేంద్రరావుగారు పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. కాగా ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ పూర్తీ అయింది.

ఈ షెడ్యుల్ లో ఒక పాట మరియు టాకీ పార్ట్ కి సంబంధించి 8 రోజుల షూట్ జరిగింది. ఇక తదుపరి షెడ్యూల్ జనవరి 27 నుండి ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ 12 రోజులు పాటు జరగనుంది. ఆర్కె ఫిల్మ్స్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికీ టీవీల్లో పెళ్లి సందడి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ తెగ టైమ్ కేటాయించేస్తుంటారు.

Exit mobile version