ప్రభాస్ ఫ్యాన్స్ కు భరోసా ఇస్తున్న “రాధేశ్యామ్” డైరెక్టర్.!

Prabhas Radha krishna Kumar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న అద్భుతమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్”. మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ చిత్రం నుంచి టీజర్ అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

మరి మోస్ట్ అవైటెడ్ టీజర్ కు సంబంధించే దర్శకుడు రాధా కృష్ణ స్వయంగా ఒక క్లారిటీ ఇచ్చాడు. టీజర్ అప్డేట్ అతి త్వరలోనే వస్తుంది అని అప్పటి వరకు కాస్త ఓపిక పట్టాలని ఫ్యాన్స్ కు సూచించారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఎంతైతే ఎదురు చూసారో అంతకు మించిన ఆనందం టీజర్ ఇస్తానని ప్రామిస్ చేసి రాధాకృష్ణ ప్రభాస్ ఫ్యాన్స్ కు భరోసాను ఇచ్చారు.

దాదాపు టీజర్ ఈ సంక్రాంతికే వస్తుందని టాక్ ఉంది. మరి ఎప్పుడు అన్నది మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఫ్యాన్స్ కూడా అప్పటికి ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకుంటారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version