జనవరి 8న “వలస” విడుదల

Valasa

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవించారు. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ లక్షలాది మంది వలస కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు.వారి జీవితాలలో జరిగిన సంఘటనలే ఇతివృత్తము గా కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో మనోజ్ నందం, వినయ్ మహాదేవ్, తేజు అనుపోజు, గౌరీ లు ప్రధాన జంటలుగా, ఎఫ్ ఎం బాబాయ్, తులసి, సన్నీ, మనీష, తనూష, సముద్రం వెంకటేశ్, వాసు, నల్ల శీను, మల్లికా, చిన్నారి, ప్రవీర్ నటీ నటులుగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్,స్క్రీన్ షాట్ ఇన్ఫోటైన్మెంట్ సంయుక్తంగా యక్కలి రవీంద్రబాబు నిర్మిస్తున్న “వలస” చిత్రం ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా…

చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..ఈ చిత్రం మొత్తం విశాఖపట్నంలో సమయంలోనే చిత్రీకరణ జరుపుకుంది. నరేష్ కుమార్ మడికి ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో బాటు ఎడిటర్ గా కూడా తన సేవలు అందించారు. వలస జీవుల జీవిత వేతలనే కాకుండా వారి జీవితంలోని అన్ని పర్శ్వాలు సృషించడం తమ ఉద్దేశమని కష్టకాలంలో కూడా వారి మధ్య వెల్లివిరిసిన అనుబంధాలు, నిజ జీవిత హాస్యం, వారి మనోభావాలు ప్రతిఫలించే అంశాలు ఇందులో పొందుపరిచామని చిత్ర దర్శకుడు తెలియజేశారు.

నిర్మాత యక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ ..ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రవీణ్ ఇమ్మడి సంగీతంతో వచ్చిన వలస పాటకి మంచి ఆదరణ ఉందని అలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని, దాదాపు కోటి మందికి పైగా వలస కార్మికులు తమ తమ స్వగ్రామాలకు వెళ్ళడానికి చేసిన సాహస యాత్ర ఈ “వలస” సినిమా.లాక్ డౌన్ సమయంలో కూడా ఎంతో రిస్క్ చేసి తమ చిత్రాన్ని తెరకెక్కించాము. ప్రేక్షకులకు ఇది వారితో పాటు కలిసి ప్రయాణం చేసిన అనుభూతి ఇస్తుందని రాబోయే తరాలకు ఇది ఒక మంచి విజువల్ డాక్యుమెంట్ గా ఉంటుందని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి దీనికి సంబంధించి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించడానికి ప్రోత్సాహం ఇవ్వాలని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ శ్రావ్య ఫిలిం సంస్థ ఇదివరకు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన “సొంత ఊరు” “గంగపుత్రులు” గల్ఫ్ తరహాలోనే ఇది ఒక మంచి చిత్రమవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ద్వారా, ఓవర్సీస్ లోను, తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలోనూ విడుదల చేస్తున్నామని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని తాము భావిస్తున్నామని తెలిపారు.

Exit mobile version