ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల్లో కన్నడ సెన్సేషల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన “సలార్” కూడా ఒకటి. హై ఎండ్ యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా పూర్తి కాబడుతుంది. అయితే మరి మరి లేటెస్ట్ గా ఈ సినిమా సీక్రెట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ చిత్రం డైరెక్ట్ సినిమా కాదని ఇది వరకే నీల్ తెరకెక్కించిన “ఉగ్రమ్” కు రీమేక్ అని కేజీయఫ్ మరియు ఈ చిత్ర సంగీత దర్శకుడు రవి బాసృర్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. దీనితో ఈ సీక్రెట్ ఇప్పుడే బయట పడింది అని అంతా అనుకుంటున్నారు. కానీ రవి మాత్రం ఇది అందరికీ తెలిసిందే కదా అని సింపుల్ గానే చెప్పేసాడు.
అంటే ఇది రీమేక్ అయినప్పటికీ మేకర్స్ చెప్పలేదు తప్పితే గోప్యంగా ఉంచాలనుకోలేదు ఏమో మరి..ఇక ఈ సాలిడ్ థ్రిల్లర్ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా నాలుగు నెలల్లోనే పూర్తి చేసేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.
