సెకెండ్ షెడ్యూల్ రెడీ అవుతోన్న “సలార్” !

Salaar

కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ ను చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో ఈ నెల 22 నుండి షూట్ చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడట. ఇక ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. రానున్న ఐదు నెలలు మొత్తం ప్రభాస్ సలార్ కోసమే కేటాయించనున్నాడు. కాగా ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

Exit mobile version