ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. అలాగే ఈ సినిమా టీజర్ ను తారక్ పుట్టినరోజు మే 20 నుండి రిలీజ్ చేస్తారట.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
