బన్నీ మరో పాన్ ఇండియన్ సినిమా టార్గెట్ అప్పుడే.!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాతోనే బన్నీ మొట్ట మొదటి సారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ మరింత ప్రతిష్టాత్మకంగా కూడా నిలిచింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం లైన్ లో ఉన్న సమయంలోనే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే, మరి ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ చిత్రం తాలూకా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయట.

అలాగే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చెయ్యనున్నారో అన్నది కూడా తెలుస్తుంది. బన్నీ ప్రస్తుతం చేస్తున్న “పుష్ప” షూట్ అయ్యిన వెంటనే స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది వేసవి రేస్ లో ఈ భారీ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version