పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బండ్ల గణేష్ ఎట్టకేలకూ తన నిర్మాణంలో సినిమా చేయడానికి ఒప్పించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కోసం బండ్ల గణేష్ ప్రస్తుతం ఓ కథను వెతికాడు. ఈ క్రమంలో రచయిత కోన్ వెంకట్ దగ్గర, బండ్ల ఒక కథను ఓకే చేసినట్లు.. త్వరలోనే పవన్ కు కూడా ఈ కథను వినిపించనున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పైగా ఈ కథ గానీ ఓకే అయితే పూరి డైరెక్ట్ చేస్తాడట.
ఇక కోన రాసిన కథ విషయానికి వస్తే.. కథలో పవన్ పాత్ర చాల కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. మరి కోన చెప్పే కథ పవన్ కు నచ్చితే.. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది నుండి పూరి డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎలాగూ కాలేజీ నేపథ్యంలో పవన్ సినిమా అంటే.. పైగా పవన్ లెక్చరర్ పాత్ర అంటే.. సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.
