నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్న ‘ఇరుముడి’ !

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా ‘ఇరుముడి’. బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రికార్డులను బద్దలుకొట్టి, రవి తేజ కెరీర్ లోనే అతిపెద్ద వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఐతే, నెట్‌ఫ్లిక్స్‌లో బహుభాషా డిజిటల్ విడుదల తర్వాత, ఈ చిత్రం సోషల్ మీడియాలో కొత్తగా విమర్శల వెల్లువను ఎదుర్కొంది.

కొంతమంది ఆన్‌ లైన్ లో ఈ చిత్రాన్ని ‘ఓవర్‌రేటెడ్’ అని ముద్రవేసి, థియేటర్లలో వసూళ్లను ప్రశ్నించినప్పటికీ, ‘ఇరుముడి’ ఈ వ్యతిరేకతను తట్టుకుని నెట్‌ ఫ్లిక్స్‌ లో నెం. 1 ట్రెండింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏది ఏమైనా ఈ సినిమాలోని భావోద్వేగ లోతు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

కాగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version