బెల్లంకొండ రెండో వారసుడి రెండవ సినిమా

Bellamkonda Ganesha

నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ హీరోగా సెటిలైన సంగతి తెలిసిందే. త్వరలో అయన బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక రెండవ కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడ హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టే జరిగి ఉంటే ఈపాటికే సినిమా పూర్తై ఉండాల్సింది. పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడు. గతేడాది జనవరిలో సినిమా మొదలైంది. కొంత షూటింగ్ జరిగాక లాక్ డౌన్ పడటంతో ఆగిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ మొదలుకాలేదు.

లాక్ డౌన్ అనంతరం రీస్టార్ట్ చేసే ప్రయత్నాలు జరిగినా చివరకు అటకెక్కేసింది. దీంతో గణేష్ రెండవ సినిమాను సెట్ చేసుకున్నాడు. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా జరుగుతోంది. డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ప్రజెంట్ షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకురానున్నాయి. ఇది ఆయనకు రెండవ సినిమా అయినా కూడ అధికారికంగా మాత్రం ఇదే డెబ్యూ సినిమా.

Exit mobile version