‘వకీల్ సాబ్’ సెన్సార్ రిపోర్ట్స్ ఏమిటంటే

Vakeel Saab 2

లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న భారీ సినిమా ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వంద శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో వసూళ్లు భారీ స్థాయిలో ఉండనున్నాయి. విడుదలకానున్న ఏప్రిల్ 9వ తేదీన దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువ సంఖ్యలో ఈ సినిమానే ప్రదర్శితం కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నాడనే ఆతురుతలో ఉన్నారు ఫాన్స్.

విడుదలకు ఇంకొక మూడు రోజుల సమయం మాత్రమే ఉడటంతో చిత్ర బృందం సెన్సార్ పనుల్ని కంప్లీట్ చేసింది. సెన్సార్ బోర్డు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారట. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని సెక్షన్ల ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందనే టాక్ నడుస్తోంది ఫిలిమ్ నగర్ వర్గాల్లో. మరోవైపు సినిమాలో పవన్ క్యారెక్టర్ నిడివి మీద పెద్ద చర్చ నడుస్తోంది. కొందరేమో పవన్ 40 నిముషాలే కనిపిస్తాడని అంటే ఇంకొందరేమో 50 నిముషాలు ఉంటారని అంటున్నారు. మరి వీటిలో నిజం ఎంత అనేది తెలియాలంటే 9వ తేదీ వరకు ఆగాల్సిందే.

Exit mobile version