అల్లు అరవింద్ కు కరోనా వచ్చిన మాట నిజమే.. కానీ

AlluAravind

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడ ఆయనకు కరోనా వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో సగం వాస్తవం, ఇంకో సగం అవాస్తవం ఉన్నాయి. ఈ వార్తల మీద స్పందించిన అరవింద్ తనకు కరోనా సోకినా మాట నిజమే అన్నారు. కానీ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడ రావడం అనేది అవాస్తవమని అన్నారు.

తాను ఒక డోస్ మాత్రమే తీసుకున్నాను అంటున్న అరవింద్ కొన్నిరోజుల క్రితం ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి బయటి ఊరికి వెళ్లానని, ఊరి నుండి వచ్చాక ముగ్గురికీ కరోనా వచ్చిందని, తాను, ఇంకొక స్నేహితుడు వ్యాక్సిన్ తీసుకున్నామని, ఇంకొకరు తీసుకోలేదని కాబట్టే తామిద్దరి మీద కరోనా అంత బలంగా ప్రభావం చూపలేకపోయిందని, మాకు ఫీవర్ వచ్చి పోయిందని కానీ వ్యాక్సిన్ వేయించుకోని స్నేహితుడు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ సోకినా కూడ ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని, వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పడానికి తామే నిదర్శనమని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version