పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ విషయంపై మేకర్స్ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే, ఇటీవల ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రకాష్ రాజ్‌కు విభేదాలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ వార్తలను ఖండించారు. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి విలన్‌గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పోస్ట్‌లో ప్రకాష్ రాజ్‌ను ఎక్కడా కూడా ట్యాగ్ చేయలేదు.
దీంతో ఈ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ నిజంగానే తప్పుకున్నట్లు వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ కన్ఫ్యూజన్‌పై ప్రకాష్ రాజ్ కాని, స్పిరిట్ మేకర్స్ కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా భద్రకాళి పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
