‘వకీల్ సాబ్’ దర్శకుడికి పెద్ద అవకాశాలున్నాయట

venu sriram dilraju

వేణు శ్రీరామ్.. నిన్న మొన్నటివరకు ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా తెలియని పేరు. ‘ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ’ సినిమాలు చేసినా కూడ ఆయనకు మాస్ ప్రేక్షకుల్లో అంత క్రేజ్ అయితే లేదు. కానీ ఎప్పుడైతే ఆయన్ను దిల్ రాజు ‘వకీల్ సాబ్’ సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేశారో అప్పుడే ఆయన పేరు అందరికీ తెలియడం మొదలైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వేణు శ్రీరామ్ పేరును విస్తృతంగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఏ దర్శకుడైనా స్టార్ దర్శకుల జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నట్టే.

వేణు శ్రీరామ్ విషయంలో కూడ ఇదే జరిగింది. ఇక ‘వకీల్ సాబ్’ టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడం, ప్రీరిలీజ్ వేడుకలో ఆయన్ను పవన్ ప్రత్యేకంగా పవన్ పొగడటం వలన ఇండస్ట్రీలో ఆయన మీద చాలామంది గురిపెట్టారు. దిల్ రాజు బ్యానర్లోనే ఆయన మరొక పెద్ద సినిమా చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 9వ తేదీన రిలీజ్ కానున్న ‘వకీల్ సాబ్’ గనుక మంచి విజయాన్ని అందుకుంటే వేణు శ్రీరామ్ డిమాండ్ అమాంతం పెరిగిపోవడం, ఆయనకు పెద్ద హీరోల నుండి నిర్మాతల నుండి ఆఫర్లు వెల్లువెత్తడం ఖాయం.

Exit mobile version