పూరి, విజయ్ ‘లైగర్’ లెవల్ ఇంకా పెరిగింది

Liger

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తు తెలిసిందే. ‘లైగర్’ అనేది ఈ సినిమా టైటిల్. ఇందులో విజయ్ ఒక ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. విజయ్, పూరి జగన్నాథ్ కెరీర్లో ఇదే అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాకు అవుతున్న ఖర్చు మొత్తం రూ. 125 కోట్లని అంటున్నారు. ఈ సినిమాతో విజయ్ పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా మారిపోనున్నాడు.

సినిమాలో యాక్షన్ కంటెంట్ హెవీగా ఉంటుందట. యాక్షన్ సీక్వెన్స్ రూపకల్పన కోసం ప్రముఖ హాలీవుడ్ కొరియోగ్రఫర్ ఆండీ లాంగ్ పనిచేస్తున్నాడట. ఈ స్టంట్ కొరియగ్రఫర్ జాకీ చాన్, ప్రముఖ హాలీవుడ్ హీరోల సినిమాలకు వర్క్ చేశారు. ఈయన చేరికతో సినిమా లెవల్ అమాంతం పెరిగింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయకిగా నటిస్తోంది. లాక్ డౌన్ మూలంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలో రీస్టార్ట్ అయింది. రమ్యకృష్ణ లాంటి స్టార్ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడ రూపొందుతోంది ఈ చిత్రం.

Exit mobile version