ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత కాస్త మిస్టరీ తోనే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. అయితే కొరటాల శివతో సినిమా ఫిక్స్ కాకముందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరియు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మధ్యలో మళ్ళీ కొన్ని పరిణామాలు మారడంతో అవి కాస్తా పక్కకి వెళ్లాయి. మరి ఇపుడు వీటిపైనే మళ్ళీ ఆసక్తికర ప్రశ్నలు వస్తున్నాయి. ఆల్రెడీ తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అయితే ఉంది కానీ ఎప్పుడు మొదలు అవుతుంది అన్నది కన్ఫర్మేషన్ లేదు. మరి మిగిలి ఉంది ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిందే.. దీనిపైనే సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఉందా ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.