సుధీర్‌బాబు చేతుల‌ మీదుగా `స్వ` చిత్రంలోని `నింగిన జారిన ` లిరిక‌ల్ సాంగ్‌ విడుదల

shav

మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి లు ముఖ్య తారాగణంగా, జీఎమ్ఎస్ గ్యాల‌రీ ఫిలిం ప‌తాకంపై మ‌ను పీవి ద‌ర్శ‌క‌త్వంలో జీఎమ్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం `స్వ‌`. ఇప్ప‌టికే విడుద‌లైన `స్వ‌` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు ఈ చిత్రంలోని `నింగిన జారిన జాబిలి` అనే గీతాన్ని హీరో సుధీర్‌బాబు రిలీజ్ చేశారు.

ఓ మైన విన‌వే హామీనే ఇస్తున్నానే.. క‌డ‌వ‌ర‌కు నీతో నీ వాణ్ణై ఉంటానే..అంటూ సాగే ఈ గీతాన్ని కార్తిక్, నాదప్రియ ఆల‌పించగా సంగీత ద‌ర్శ‌కుడు కరణం శ్రీ రాఘవేంద్ర స్వరపరిచారు. నాగరాజు కువ్వారపు సాహిత్యాన్ని అందించారు.

Exit mobile version