న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. నిన్న(సెప్టెంబర్ 23) రాత్రి ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోలను పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఇక ఈ ప్రీమియర్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు రికార్డు స్థాయిలో అక్యుపెన్సీ నమోదైంది. భారీ అంచనాలకు తోడు ప్రీమియం టికెట్ ధరలు కూడా కలిసి రావడంతో, ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రీమియర్స్ ద్వారానే ఇండియా వ్యాప్తంగా రూ. 12.8 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల ఆకట్టుకునే మేకింగ్‌తో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది.
మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీమియర్స్ అందించిన బిగ్ స్టార్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
