తెలుగు షోకి హోస్ట్ గా తమన్నా !

Tamannaah1

మిల్క్ బ్యూటీ తమన్నా హోస్ట్‌ అవతారం ఎత్తనుంది. ఓ తెలుగు టీవీ ఛానల్‌ లో ప్రసారం కానున్న ‘మాస్టర్‌ చెఫ్‌ ఇండియా తెలుగు’ అనే షోకు హోస్ట్‌ గా సందడి చేసేందుకు తమన్నా రెడీ అవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్ లో చేసిన ఒక పోస్ట్ ద్వారా ఈ విషయం గురించి ఆమె అభిమానులకు తెలిసింది.

అయితే, తమన్నా ముంబయిలో పుట్టి పెరిగారు. కానీ ఆమె తెలుగు చక్కగా మాట్లాడుతుంది. ఏది ఏమైనా ఒక నార్త్ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎన్నో కష్టాలు పడి, ఒక్కో మెట్టు ఎక్కి నేడు ఒక తెలుగు టీవీ ఛానల్‌ లో ప్రసారం కానున్న ఒక షోకి తెలుగులో హోస్ట్ చేస్తోంది అంటే విశేషమే. ఇక తమన్నా ఈ షో కోసం షూట్‌కు సిద్ధమవుతున్న సమయంలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.

Exit mobile version