కమల్ సినిమాలో హీరోయిన్ ఆమేనా ?

kamal haasan

విశ్వనటుడు కమల్ హాసన్ మలయాళం ‘దృశ్యం-2’ను తమిళంలోకి రీమేక్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ మొదటి భాగాన్ని కూడ ఆయన ‘పాపనాశనం’ పేరుతో రీమేక్ చేశారు. అందులో కమల్ హాసన్ సరసన గౌతమి నటించడం జరిగింది. ఆ సినిమా జరిగే సమయానికి కమల్, గౌతమి ఇద్దరూ సహజీవనంలో ఉన్నారు. కానీ వారిప్పుడు విడిపోయారు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. ‘దృశ్యం-2’ రీమేక్ చేయడానికి ఆమె సుముఖంగా లేరు. దీంతో కథానాయికను మార్చాల్సిన అవసరం ఏర్పడింది.

ఒరిజినల్ వెర్షన్లో, తెలుగు రీమేక్ ‘దృశ్యం-2’లో నటించిన మీనాను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ నిర్ణయం కూడ మార్చుకున్నారట. సీనియర్ నటి నదియాను కథానాయకి పాత్రకు తీసుకోవాలని చూస్తున్నారట. నదియా తెలుగు ‘దృశ్యం’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. మరి ఆమె కమల్ హాసన్ జోడీగా నటించడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version