ఓటిటి సమీక్ష : ‘ది టుమారో వార్’ ( అమెజాన్ ప్రైమ్‏ లో ప్రసారం)

The-Tomorrow-War Movie Review

విడుదల తేదీ : జూలై 02,2021
123telugu.com Rating : 2.5/5

నటీనటులు : క్రిస్ ప్రాట్, వైవోన్నే స్ట్రాహోవ్స్కీ, జె. కె. సిమన్స్, బెట్టీ గిల్పిన్, సామ్ రిచర్డ్సన్, ఎడ్విన్ హాడ్జ్, జాస్మిన్ మాథ్యూస్, ర్యాన్ కీరా ఆర్మ్‌స్ట్రాంగ్, కీత్ పవర్స్ తదితరులు

దర్శకుడు : క్రిస్ మెక్కే

నిర్మాతలు : డేవిడ్ ఎల్లిసన్, డానా గోల్డ్‌బెర్గ్, డాన్ గ్రాంజెర్, జూల్స్ డాలీ, డేవిడ్ ఎస్. గోయెర్, ఆడమ్ కోల్‌బ్రెన్నర్

సంగీతం : లోర్న్ బాల్ఫే

సినిమాటోగ్రఫీ : లారీ ఫాంగ్

ఎడిటింగ్ : రోజర్ బార్టన్, గారెట్ ఎల్కిన్స్

క్రిస్ ప్రాట్, వైవోన్ స్ట్రాహూవ్స్కీ ప్రధాన పాత్రలో నటించిన ‘ది టుమారో వార్’ సిరీస్ అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అయింది. ఈ సిరీస్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు సినిమా లవర్స్. పైగా దీనిని తెలుగు, తమిళ భాషలలో కూడా అనువదించారు. మరి ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

 

2051లో గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే ప్రపంచ యుద్దం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. డాన్ ఫారెస్టర్ (క్రిస్ ప్రాట్) భవిష్యత్ యుద్ధంలో పోరాడటానికి సన్నద్ధం అవడం, అయితే అతను నిర్దేశించిన మిషన్ కోసం చివరకు అతని పర్సనల్ లైఫ్ నే వదులుకోవాల్సి రావడంతో ఈ కథలో సంఘర్షణ మొదలైంది. ఇంతకీ ఈ భవిష్యత్తు యుద్ధ పోరాటం కోసం అతను త్యాగం చేసింది ఏమిటి? అసలు భవిష్యత్తు యుద్ధం తాలూకు అవసరాలు ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

‘ది టుమారో వార్’ అతిపెద్ద ప్లస్ పాయింట్ విజువల్సే. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్‌ లను ఎలివేట్ చేయడానికి అద్భుతమైన విఎఫెక్స్ మరియు క్వాలిటీ సీజిఐను విస్తృతంగా ఉపయోగించడంతో ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కింది. అలాగే టెక్నికల్ సాంకేతికతో సృష్టించిన గ్రాఫిక్స్ యొక్క నాణ్యత కూడా చాల బాగుంది. ఈ సినిమా నేపథ్య వాతావరణం కూడా దృశ్యపరంగా ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది.

నటీనటుల విషయానికి వస్తే.. క్రిస్ ప్రాట్, వైవోన్ స్ట్రాహూవ్స్కీ మరియు సామ్ రిచర్డ్సన్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. వారు అతి సంక్లిష్టమైన పాత్రలలో తమదైన శైలి నటనతో ఆ పాత్రలకు బలాన్ని చేకూర్చారు. ఇక సినిమాలో యాక్షన్ కూడా అదిరిపోయింది.

 

మైనస్ పాయింట్స్ :

 

యుద్ధ వాతావరణంలో వచ్చే సీన్స్ అలాగే కొన్ని విజువల్ సీన్స్ భారీ స్థాయిలో ప్రదర్శించినప్పటికీ, కథ చెప్పే ముఖ్య అంశాలు మరీ పేలవంగా ఉన్నాయి. అలాగే స్క్రీన్ ప్లే కూడా బలంగా లేదు. కథానాయకుడికి మరియు అతని కుమార్తెకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా భావోద్వేగంగా ఎలివేట్ చేసి ఉండాల్సింది. ఆ కోణంలో గాని తీసి ఉండి ఉంటే ఆ ట్రాక్ ఇంకా ఇంట్రెస్ట్ గా ఉండేది.

అలాగే టైమ్ ట్రావెల్ మరియు టెలిపోర్టేషన్ థీరీలు కోర్ ప్లాట్‌లోకి చొప్పించబడిన విధానం కూడా మరీ ఫోర్స్ గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే మరియు పాత్రల తాలూకు ఆర్క్ కొంచెం క్లిష్టంగా ఉండటం కూడా సినిమాకి పెద్ద మైనస్ పాయింట్.

స్థానిక ప్రేక్షకులలో ఒక వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రంలో ‘సాంకేతికతతో సాగే సీన్స్ ఆకట్టుకోవచ్చు. కానీ గ్రహాంతర దండయాత్ర థ్రెడ్ కూడా మరీ బలవంతంగా ఇరికించినట్టు ఉంది. ఆ విషయంలో ఈ సినిమా బాగా నిరాశ పరిచింది.

 

సాంకేతిక విభాగం :

 

మంచి ఎమోషనల్ థ్రెడ్ తో తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని అంశాలలో ఆకట్టుకున్నా.. ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. అయితే రైటింగ్ పరంగా కొంతవరకు బాగానే ఉంది. విఎఫెక్స్ మరియు సీజిఐ వర్క్ చాలా బాగుంది. దాంతో మరో కొత్త ప్రపంచపు అనుభవాన్ని ఈ సినిమా మనకు అందిస్తోంది. ఎడిటింగ్ పర్వాలేదు. నేపథ్య సంగీతం క్వాలిటీ బాగుంది.

 

తీర్పు:

 

గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే ప్రపంచ యుద్దం నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కొన్ని అంశాల్లో బాగుంది. అయితే కరెక్ట్ గా ఎలివేట్ కానీ సబ్‌ ప్లాట్‌ ల కారణంగా ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. అయినప్పటికీ విజువల్ బ్యూటీ, అలాగే ప్రధాన తారాగణం కనబర్చిన ప్రదర్శనలు ఈ చిత్రానికి అతి పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version