ఎస్ ఆర్ కళ్యాణమండపం ట్రైలర్ కి వస్తోన్న భారీ రెస్పాన్స్!

sr kalyanamandapam

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా ఎలైట్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ప్రమోద్ రాజు నిర్మాతలు గా శ్రీధర్ గాదే దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం ఎస్ ఆర్ కళ్యాణమండపం EST 1975. అయితే ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన చుక్కల చున్ని, చూసాలే కళ్ళారా, సిగ్గెందుకు రా మావ వంటి పాటలు యూ ట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా, సోషల్ మీడియా లో సైతం ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రం టీజర్ కి సైతం భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇలా సర్వత్రా పాజిటివ్ టాక్ రావడం తో సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా ఈ చిత్రం ను ఆగస్ట్ 6 వ తేదీన థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం తో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మేరకు తాజాగా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ చిత్రం లో సాయి కుమార్ కూడా నటించడం తో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సాయి కుమార్ మాట్లాడుతూ, తన సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి అని, వాటిలో పోలీస్ స్టోరీ, ప్ర‌స్థానం చిత్రాలు నాకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఇచ్చాయి అని అన్నారు. తన యాభై ఏళ్ల సినీ జీవితంలో తను ఇప్ప‌టి వ‌రుకు పోషించిన పాత్ర‌లు తన ఫ‌స్ట్ ఇన్నింగ్స్ కి వైభ‌వాన్ని తీసుకొస్తే తన సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుత‌మైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 అవ్వ‌డం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం చాలా ఫోక‌స్ డ్ గా ప‌నిచేస్తూ ఉంటాడు అని, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాల‌ని కోరుకుంటున్నాను అని, అలానే ప్రేక్ష‌కులు మా ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి ప్రోత్స‌హించాల‌ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.

హీరో కిర‌ణ్ అబ్బ‌వరం మాట్లాడుతూ, కుటంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా మా SR క‌ళ్యాణమండంపం EST 1975 అని అన్నారు. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రికి ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను అని అన్నారు. తను థియేట‌ర్ల‌లో, టీవీల్లో చూసిన సాయికుమార్ వంటి గొప్ప న‌టులు ప‌క్క‌న న‌టించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను న‌మ్మి ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ తీసుకున్న శంక‌ర్ పిక్చ‌ర్స్ వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. అయితే తను క‌థ చెప్ప‌గానే తనను న‌మ్మిన ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ అధినేతలు ప్ర‌మోద్, రాజుల‌కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటా అని అన్నారు. వారి ప్రోత్సాహం లేక‌పోతే ఈ సినిమా ఇలా వ‌చ్చేది కాదు అని, అలానే ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఈ సినిమా ఆద్యంతం అల‌రించే రీతిన తీర్చిదిద్దారు అని అన్నారు. మేమంతా చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ఆగ‌స్ట్ 6న థియేట‌ర్ల‌కి వ‌చ్చి ప్రేక్ష‌కులు ప్రోత్స‌హిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.

Exit mobile version