సమీప మూవీస్ మరియు యు & ఐ స్టూడియోస్ పతాకాల పై హాస్య నటుడు షకలక శంకర్, సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరో హీరోయిన్లు గా సంజయ్ పూనూరి దర్సకత్వంలో ఎ. పద్మనాభిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం కార్పొరేటర్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చెసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా కార్పోరేటర్ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో షకలక శంకర్ మరియు హీరోయిన్లు చాలా బాగా నటించారు అని అన్నారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, ఇందులోని పాటలు, ఫైట్స్ సందర్భానుసారంగా వస్తాయని తెలిపారు. ఈ సినిమాలో 5 పాటలు, 4 ఫైట్స్ ఉంటాయి, మా యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
