హుషారు ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా పవన్ కుమార్ కె దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై నిర్మించిన ఈ సెన్సిబుల్, క్యూట్ లవ్‌స్టోరీ ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణను పొందింది. ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇప్పుడు ప్రముఖ డిజిటల్ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్ కొత్తూరి మాట్లాడుతూ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన మా ‘మెరిసే మెరిసే’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారని, స్త్రీ సాధికారత అనే అంశాన్ని ప్రేమ కథకు ముడిపెట్టి వివరించిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చిందని, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాను తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేయండని అన్నారు. దినేష్ తేజ్, శ్వేతా అవస్థి సహా నటీనటుల పెర్ఫామెన్స్, లవ్ అండ్ ఎమోషనల్ పాయింట్స్ చాలా బాగున్నాయని అన్నారు.
