ఇది తెలుగు సినిమా మరియు తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. సి. ఎన్. ఎన్ ఐ. బి. ఎన్ నిర్వహించిన దేశమంతటా నిర్వహించిన ఒక పోల్ లో మన తెలుగు దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు గారు భారత దేశంలోనే అత్యంత గొప్ప నటుడిగా ఎంపికయ్యారు. ఆయనకీ 53 శాతం మంది వోట్లు వేసారు.మరో దిగ్గజ నటుడు కమల్ హాసన్ 44 శాతం వోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. శ్రీదేవి 39 శాతంతో అత్యంత గొప్ప కధానాయికగా ఎన్నిక కాగా, మాధురీ దీక్షిత్ మరియు సావిత్రి గారు రెండు మూడు స్థానాలలో ఉన్నారు.ఎన్. టి. ఆర్ మరియు సావిత్రి తెలుగు సినీ కళామతల్లి కిరీటంలో వన్నె తరగని వజ్రాలు. వీరికి ఇటువంటి గౌరవం దక్కడం ఆనందకరం.
