వరల్డ్ వైడ్ మరో రికార్డ్ మార్క్ అందుకున్న “RRR” వసూళ్లు.!

RRR m 11 1

గ్లోబల్ స్టార్స్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సంచలన విజయ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అయితే ఈ భారీ అంచనాలు అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా సహా భారతీయ సినిమాని ప్రపంచ సినిమా దగ్గర మరో స్థాయికి తీసుకెళ్లి ఇండియన్ సినిమా సత్తా చాటింది.

అయితే ఎంతోమంది హాలీవుడ్ దిగ్గజ దర్శకులను సైతం మెస్మరైజ్ చేసిన ఈ చిత్రం పేరు ప్రపంచ వ్యాప్తంగా ఇన్నాళ్లు అయ్యిన కూడా ఏదొకలా వినిపిస్తూ వస్తుంది. ఇక ఈ భారీ చిత్రం అయితే జపాన్ లో ఇప్పటికీ రికార్డు రన్ తో దూసుకెళ్తుండగా అక్కడ వసూళ్లతో అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ 1300 కోట్ల భారీ గ్రాస్ మార్క్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో RRR సెన్సేషనల్ రన్ కి ఇంకా బ్రేక్ పడలేదు అని చెప్పాలి.

Exit mobile version