భగవంత్ కేసరి నాన్ థియేట్రికల్ పార్ట్ నర్స్ ఇవే!

Bhagavanth Kesari 2
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకి సంబందించిన నాన్ థియేట్రికల్ పార్ట్ నర్స్ పై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అదే విధంగా జీ తెలుగు టీవీ ఛానల్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Exit mobile version