తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా అద్బుతమైన కలెక్షన్స్ తో దూసుకు పోతూ, ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో 200 కోట్ల గ్రాస్‌ను దాటనుంది. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నందున రేపు చాలా దివ్యమైనది.
ఈ శుభ సందర్బంగా మల్టీప్లెక్స్ చైన్ మిరాజ్ సినిమాస్ సినీ ప్రియులకు సాలిడ్ ఆఫర్ ప్రకటించింది. నియమాలు మరియు షరతులకు లోబడి, రేపటి కోసం ఎంపిక చేసిన ప్రదేశాలలో మల్టీప్లెక్స్ చైన్ ద్వారా ఒకటి టికెట్ కొంటే ఇంకొకటి ఫ్రీ ఆఫర్ ను స్టార్ట్ చేసింది. దీని వల్ల సినిమాకు మరిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. హనుమాన్‌లో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, సత్య మరియు గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు.
