యువ నటుడు శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి మనమే అనే టైటిల్ ని యూనిట్ పరిశీలిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ నుండి అతి త్వరలో అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి. ఇక దీనితో పాటు లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డితో కూడా ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
విషయం ఏమిటంటే, యూనీక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ ఫామిలీ డ్రామా మూవీలో శర్వానంద్ తండ్రి పాత్రలో యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్. ఇటీవల నితిన్ హీరోగా రూపొందిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో ఒక కీలక పాత్ర చేసి అందరినీ అలరించారు రాజశేఖర్. ఇక ఈ మూవీలో రాజశేఖర్ ది రెండు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్ర అని అంటున్నారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ మార్చి 2 తో కంప్లీట్ కానుండగా తదుపరి షెడ్యూల్ ని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో ప్రారంభించనున్నారట.
