పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో సందడి చేయడానికి కేవలం రెండు రోజులే సమయం ఉంది. ఈ మాస్ పోలీస్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ మూవీ ఫైనల్ అవుట్‌పుట్ చూశాక తాను చాలా సంతోషంగా ఉన్నానని దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
మరోవైపు, ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో అప్పుడే ప్రభంజనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ ఇప్పటికే 250K డాలర్ల మార్కును దాటేశాయి. ప్రీమియర్లకు ఇంకా ఒక రోజు సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు రావడం బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్‌కు సంకేతంగా కనిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తుండగా.. పార్థిబన్, గౌతమి, రావు రమేష్ మరియు కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలవగా, థమన్ అందించిన పవర్ ఫుల్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్తుందని టీమ్ ధీమాగా ఉంది. భారీ క్రేజ్ మరియు సామాన్యులకు అందుబాటులో ఉన్న టికెట్ ధరలు చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
