టాక్..మళ్లీ పవన్ ఫ్యాన్స్ కి నిరాశేనా?

Hari Hara Veera Mallu e1727516662439

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ చిత్రం “హరిహర వీరమల్లు” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు దాదాపు షూటింగ్ అంతటినీ పూర్తి చేసేసుకుంది. అయితే ఈ సినిమా కాకుండా మరో సినిమా దర్శకుడు సుజీత్ తో “ఓజి” పవన్ చేస్తున్నారు. మరి దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ రెండు సినిమాలు నుంచి కూడా సాలిడ్ అప్డేట్స్ పవన్ బర్త్ డే కానుకగా ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. వీరమల్లు నుంచి టీజర్ అలాగే ఓజి నుంచి ఫస్ట్ సింగిల్ పవన్ బర్త్ డే కి గత నెల లాక్ చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో అవి ఆగిపోయాయి. ఇక వీటిని మళ్లీ దసరా కానుకగా విడుదల చేస్తారు అంటూ ఓ రూమర్ ఈ మధ్య నడిచింది. కానీ ఈసారి కూడా పవన్ ఫ్యాన్స్ నిరాశ తెప్పేలా లేదని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు నుంచి కూడా దసరా కానుకగా ఎలాంటి మేజర్ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ లేదనే తెలుస్తోంది. సో పవన్ ఫ్యాన్స్ కి మాత్రం మరోసారి డిజప్పాయింట్మెంట్ తప్పేలా లేదని చెప్పాలి.

Exit mobile version