ట్రైలర్ టాక్: ఉగాదికి మాస్ జాతర తీసుకొస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh

ఈ ఉగాది కానుకగా మన తెలుగు సినిమా నుంచి వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సాలిడ్ మాస్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) అనే చెప్పాలి. దర్శకుడు హరీష్ శంకర్ తో వస్తున్న రెండో సినిమా కావడంతో అంతా మళ్ళీ అంతా గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారు.

మేకర్స్ అంతా చాలా నమ్మకంగానే ఉన్నారు. అయితే ఆడియెన్స్ లో మరింత నమ్మకం కలిగించడానికి సిద్ధం చేసిన ట్రైలర్ కట్ ని ఇప్పుడు మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ అభిమానులు అంచనాలు తగ్గట్టే సాలిడ్ గా ఉందని చెప్పవచ్చు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ ట్రైలర్ ని మాత్రం ఫ్యాన్స్ హైప్ కి ఏమాత్రం తగ్గకుండా కట్ చేయడం విశేషం.

యాక్షన్, ఎంటర్టైనింగ్ అంశాలు పవన్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న డైలాగ్ లు ప్రాసలు.. మధ్యలో అలా ‘ఓజి’ కూడా వచ్చి వెళ్లడం వంటి అంశాలతో మంచి ఎనర్జిటిక్ గా ప్లాన్ చేయడం మరింత హైప్ ని తీసుకొచ్చింది. ఇక శ్రీలీలతో కెమిస్ట్రీ, రాశి ఖన్నా రోల్ కూడా ఇందులో బాగా కనిపిస్తున్నాయి. థమన్ స్కోర్ కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఉంది.

అయితే ట్రైలర్ లో చిన్న టెక్నీకల్ లోపాలు ఉన్నట్టు కనిపిస్తుంది. స్టార్టింగ్ ఫైట్ బిట్ లో మ్యూజిక్ సింక్ లేదు. పవన్ డబ్బింగ్ కూడా క్లారిటీ లోపించినట్టు కనిపిస్తుంది. సో వీటిని సెట్ చేసుకొని వస్తే మాత్రం ఉగాదికి ఉస్తాద్ ఊచకోత థియేటర్స్ లో మాస్ జాతరని ఆపడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కష్టమే అని చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version