విశ్వంభర.. చిరు మాస్ లుక్ వైరల్

Vishwambhara

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో రావాల్సిన సినిమా ప్రస్తుతం అంతిమ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ మళ్లీ వింటేజ్ లుక్స్ ని సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇలా ఆ మధ్య వచ్చిన పలు పోస్టర్ లు సహా ఆన్ లొకేషన్ పిక్స్ కూడా అభిమానులను ఎంతగానో ఎగ్జైట్ చేసాయి. ఇక లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మరో క్రేజీ పిక్ వైరల్ గా మారింది. మెగాస్టార్ పై కంప్లీట్ మాస్ స్వాగ్ తో ఇది కనిపిస్తోంది అని చెప్పాలి. దీనితో ఈ లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మరి మేకర్స్ ఆ డేట్ ని ఎపుడు రివీల్ చేస్తారో చూడాలి.

Exit mobile version