‘కృష్ణ లీల’ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన హీరో నిఖిల్

sri

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో దేవన్ స్వీయ దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ లవ్ స్టొరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘కృష్ణ లీల’ అనే బ్యాటీఫుల్ టైటిల్ ఖరారు చేశారు. ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హీరో నిఖిల్, బ్రహ్మశ్రీ ఎల్ వీ గంగాధర్ శాస్త్రి, డీవోపీ చోటా కే నాయుడు హాజరయ్యారు.

టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘దేవన్ చాలా పాషన్ ఉన్న యాక్టర్, డైరెక్టర్. హ్యాపీడేస్ కి ముందు నేను కూడా ఒక మంచి అవకాశం కోసం తపన పడేవాడిని. దేవుడి దయవల్ల నాకు హ్యాపీ డేస్ దొరికింది. అదే దేవుడి దయవల్ల తనకి కృష్ణ లీలతో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోషన్ పోస్టరు నాకు చాలా నచ్చింది. ఇందులో దేవ్ డిఫరెంట్ సేడ్స్ నాకు చాలా నచ్చాయి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.’ అని అన్నారు.

బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ.. ‘దేవన్ చాలా పాజిటివ్ పర్సన్. తనని చూడగానే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. నిరంతనం ప్రయత్నంలో ఉన్న వాడే ఎప్పటికైనా ఘనవిజయం సాధిస్తాడు. దేవన్ కూడా అలాంటి ఘన విజయం ఈ సినిమాతో సాధిస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా రచయిత అనిల్ గారు చాలా సంస్కారవంతులు. కృష్ణ లీల చాలా అద్భుతమైన టైటిల్. ఈ సినిమా ఆల్ టైం హిట్స్ గా నిలుస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమా పాటలు విన్నాను. చాలా గొప్ప సాహిత్యం సంగీతం ఇందులో ఉన్నాయి. ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో, డైరెక్టర్ దేవన్ మాట్లాడుతూ..‘నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన మా నిర్మాతలు జ్యోత్స్న గారికి అనిల్ గారికి ధన్యవాదాలు. వారికి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. చోటా కె నాయుడు గారు నాకు ఇష్టమైన కెమెరామెన్. ఆయనతో కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫైనల్ గా ఆయనని కలిసి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన కొన్ని మార్పులు చెప్పారు. అవి మాకు చాలా హెల్ప్ అయ్యాయి.ఈ జర్నీ ఒక మిరాకిల్ లా మొదలైంది. గంగాధర్ శాస్త్రి గారికి ఈ సినిమా కథ చెప్పాను. ఆయన నాకు విలువైన సూచనలు ఇచ్చారు. 18 పేజెస్ నుంచి నిఖిల్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన్ను చూసిన తర్వాత మరింత ఇన్స్పిరేషన్ వచ్చింది. ఈవెంట్ కొచ్చి మాకు సపోర్ట్ చేసిన నిఖిల్ అన్నకి థాంక్యూ సో మచ్’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత జ్యోత్స్న, సినిమాటోగ్రఫర్ ఛోటా కె నాయుడు, డిఓపి సతీష్ ముత్యాల, స్టోరీ రైటర్ అనిల్ కుమార్ తదితరులు మాట్లాడారు.

Exit mobile version