ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త రిలీజ్ డేట్.. ‘ధురంధర్ 2’కి బ్రేక్ పడనుందా..?

Ustaad-Bhagat-Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ప్రెస్టీజియస్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల తేదీని మేకర్స్ ముందుకు జరిపారు. నిజానికి ఈ చిత్రం మార్చి 22, 2026న విడుదల కావాల్సి ఉండగా, యశ్ నటించిన ‘టాక్సిక్’ వాయిదా పడటంతో, ఇప్పుడు మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. ఈ మార్పుతో తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద నేరుగా పోటీ నెలకొననుంది.

ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. మార్చి నెలలో వచ్చే ఈద్ మరియు శ్రీరామనవమి సెలవులు ఈ సినిమా వసూళ్లకు భారీగా కలిసివచ్చే అవకాశం ఉంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను థమన్ చూస్తుండటం విశేషం.

అయితే, పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ‘ధురంధర్ 2’ చిత్రానికి పవన్ కళ్యాణ్ క్రేజ్ బ్రేక్ వేయనుందా.. అంటే తెలుగులో అవుననే మాట వినిపిస్తోంది. పవన్ క్రేజ్ దృష్ట్యా ఉస్తాద్ చిత్రానికే ఎక్కువ థియేటర్లు కేటాయించే అవకాశం ఉంది. దీంతో ‘ధురంధర్ 2’కి కొంతవరకు డ్యామేజ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంపై ధురంధర్ 2 మేకర్స్ ఎలాంటి ఆలోచన చేస్తారో చూడాలి.

Exit mobile version