మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఫస్ట్ సింగిల్ గా మ్యూజికల్ ట్రీట్ ని అందించారు.
మరి మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సాంగ్ మాత్రం ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ళు తర్వాత కీరవాణి మెగాస్టార్ కలయికలో వచ్చిన ఈ మొదటి సాంగ్ ట్రీట్ ఇచ్చేలా ఈ మొత్తం గ్యాప్ ని ఫీల్ చేసే విధంగా అభిమానులకి పర్ఫెక్ట్ సాంగ్ గా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. మరి రామ జోగయ్య శాస్త్రి ఇచ్చిన సాహిత్యం కూడా ఇందులో అద్భుతమనే చెప్పాలి.
ఒక పక్క రామునిపై అదే రామునితో చిరంజీవికి కూడా పోలిక కడుతూ కొన్ని పదాలు అలా పర్ఫెక్ట్ గా అనిపిస్తాయి. ఇక కీరవాణి ఇచ్చిన బాణీ దానికి శంకర్ మహదేవన్ గొంతు కూడా మరింత ఆకర్షణగా నిలిచింది. అని చెప్పవచ్చు. ఇక సాంగ్ లో మెగాస్టార్ అయితే మెరిసిపోతున్నారని చెప్పాలి.
తన మార్క్ సింపుల్ అండ్ గ్రేస్ స్టెప్స్ తో ఎంతో అందంగా తాను కనిపించారు. ఇంకా ఈ సాంగ్ విజువల్ గా కూడా అద్భుతంగా ఉండేలా అనిపిస్తుంది. మెయిన్ గా ఆర్ట్ వర్క్ మేకర్స్ నిర్మాణ విలువలు స్టన్నింగ్ గా కనిపిస్తున్నాయి. మొత్తానికి విశ్వంభర నుంచి వచ్చిన ఈ సాంగ్ వినేందుకే కాకుండా అంచనాలు కూడా పెంచే విధంగా ఉందని చెప్పవచ్చు.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
