రిలీజ్ కి రెడీ అయ్యిన ‘త్రిగుణి’..!

tri

యువ నటీనటులు కుషాల్ మరియు ప్రేరణ చౌదరిల కలయికలో ఎంఎండబ్ల్యు బ్యానర్‌పై శ్రీమతి మహేశ్వరి నిర్మించిన రెండో చిత్రం “త్రిగుణి”, సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకొని, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి వైతాహవ్య వడ్లమాని దర్శకత్వం వహించగా, రుద్రపట్ల వేణుగోపాల్ ప్రాజెక్ట్ హెడ్‌గా వ్యవహరించారు.

నరబలుల నేపధ్యంలో ఈ హారర్-థ్రిల్లర్ చిత్రం సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికేట్ పొందింది. బోర్డు సభ్యుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వారి సంపూర్ణ సహకారం తో మధ్యప్రదేశ్‌ లోనే పూర్తిగా చిత్రీకరించబడింది. మధ్యప్రదేశ్ టూరిజం విభాగంలోని AMD శ్రీమతి బిదిషా ముఖర్జీ, డెప్యూటీ డైరెక్టర్ శ్రీ రామ్ తివారి, ఇతర అధికారులకు త్రిగుణి బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

దర్శకుడు వైతాహవ్య మాట్లాడుతూ, స్థానిక నటులు, సంస్కృతి, ప్రకృతి అందాలు చిత్రానికి కొత్తదనాన్ని ప్రత్యేకతను అందిచాయిని పేర్కొన్నారు. తమ తొలి చిత్రం “అరంగేట్రం” ఘనవిజయం సాధించిన తర్వాత, ,మేకర్స్ యూనిట్ “త్రిగుణి” కూడా ప్రేక్షకుల నుండి అదే స్థాయిలో ఆదరణ పొందుతుందని ఆశిస్తోంది.

నిర్మాత శ్రీమతి మహేశ్వరి మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కథా రచయిత వంశీ మాట్లాడుతూ, ఈ చిత్ర కథన శైలి ప్రేక్షకులను మొదటి నుంచి చివర వరకు కట్టిపడేస్తుంది,” అని తెలిపారు.

Exit mobile version