నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ ప్రభావం చూపిస్తోందో చూడాలి. ఎమోషన్తో కూడిన యాక్షన్ ట్రీట్ గ్యారెంటీ అంటూ మేకర్స్ చెబుతున్నారు. కాగా కళ్యాణ్ రామ్, ఈ సినిమా కథ, విజయశాంతికి నటించకపోతే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా చేయనని దర్శకుడికి స్పష్టంగా చెప్పేశాడట.
కథ బాగా నచ్చినా, తల్లిపాత్రకు విజయశాంతి మాత్రమే కళ్యాణ్ రామ్ మదిలో మెదిలారట. అందుకే, విజయశాంతి నటిస్తేనే ఈ సినిమా చేస్తానని, లేకపోతే ప్రాజెక్టు పక్కనపెడదామని కళ్యాణ్ రామ్ క్లియర్ గా చెప్పేశాడట. ఆ తర్వాత ఈ కథను విజయశాంతి ఒప్పుకోవడంతో సినిమా పట్టాలపైకి వచ్చింది. కాగా ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.
