ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ చేయనున్నాడు.
ఈ క్రమంలో ఆయన ఫిజికల్‌గా కూడా భారీ మేకోవర్ చేయనున్నాడు. దీంతో ఈ సినిమా కోసం ఆయన వర్కవుట్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన ఫిజికల్ ట్రైనర్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్రైనర్ ఎల్లాయిడ్ స్టీవెన్స్‌ను బన్నీ కూడా హైర్ చేసుకున్నాడట. తారక్ గత కొంత కాలంగా స్టీవెన్స్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకుని వర్కవుట్స్ చేస్తూ తన ఫిజిక్‌ను మెయింటెయిన్ చేస్తున్నాడు.
ఇప్పుడు బన్నీ కూడా అదే ట్రైనర్ దగ్గర వర్కవుట్ చేయనుండటంతో అల్లు అర్జున్ ఎలాంటి లుక్‌లోకి మారుతాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అట్లీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.
