మళ్ళీ సంక్రాంతికే టార్గెట్ పెట్టుకున్న వెంకీ మామ?

Venkatesh

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు. అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత ఫామ్ లోకి వచ్చిన వెంకీ మామ దెబ్బకి రీజనల్ గా ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో పడింది. అయితే ఇపుడు వెంకీ మామ నెక్స్ట్ ఎవరితో అనేది ఆసక్తిగా మారగా ఈ చిత్రం ఎవర్ గ్రీన్ కాంబో త్రివిక్రమ్ తో దాదాపు ఖాయం అని ఇపుడు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం విషయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది.

ఈ ఏడాదిలోనే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సంక్రాంతి బరిలో హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికే వెంకీ మామ త్రివిక్రమ్ ల సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఆల్రెడీ త్రివిక్రమ్ మాటల్లో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు తెలుగు ఆడియెన్స్ ని ఏ రేంజ్ లో అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇపుడు డైరెక్ట్ సినిమా కాబట్టి అంతకు మించే అంచనాలు ఉన్నాయి.

Exit mobile version