పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” అనే చెప్పాలి. దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలకి ఫ్యాన్స్ లో కొలమానం కూడా లేదు. ఆ రేంజ్ హైప్ దీనికి ఉంది. అయితే ఎప్పుడో వచ్చేయాల్సిన ఈ చిత్రం పలు కారణాలు రీత్యా ఆలస్యం అయ్యి రీసెంట్ గానే షూటింగ్ మొదలు పెట్టుకుంది.
మరి ఈ భారీ చిత్రం రిలీజ్ డేట్ పై మేకర్స్ ఇపుడు సడెన్ అండ్ సైలెంట్ గా బ్లాస్టింగ్ అప్డేట్ ని ఇచ్చేసారు. దీనితో ఓజి ఆగమనం ఈ సెప్టెంబర్ 25న థియేటర్స్ లో ఉండనున్నట్టుగా రివీల్ చేసేసారు. దీనితో పవన్ ఫ్యాన్స్ ఒకింత షాక్ అయ్యారు దానితోనే అంతే రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
FIRING WORLDWIDE in cinemas on
25th September 2025… ????????????????#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025
