‘పెద్ది’ మాస్ సాంగ్ పై మెగాస్టార్ ప్రశంసలు.. చరణ్ ని చూసి ఎంతో గర్వంగా ఉంది

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది నుంచి వచ్చిన అవైటెడ్ రెండో సాంగ్ రయ్ రయ్ రారా ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. మంచి హైప్ లో వచ్చిన ఈ సాంగ్ అంతే రీతిలో అంచనాలు అందుకొని సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇక ఈ సాంగ్ పై లేటెస్ట్ గా రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి స్పందించడం వైరల్ గా మారింది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియెన్స్ లతో రయ్ రయ్ రారా సాంగ్ స్క్రీన్ పై అదిరిపోయింది అని మెగాస్టార్ పేర్కొన్నారు. అంతే కాకుండా రామ్ చరణ్ సూపర్ స్పీడ్ లో మంచి గ్రేస్ తో అలా స్టెప్పులేయడం చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది అని మెగాస్టార్ తెలిపారు.

బుచ్చిబాబు సానా, ఏ ఆర్ రెహమాన్, జానీ మాస్టర్ లకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలానే రత్నవేలు, సాహిత్య రచయిత అనంత్ శ్రీరామ్ అలాగే నిర్మాత వెంకట సతీష్ కిలారుల పనితనం, విజన్ లని కూడా మెచ్చుకున్నారు. ఇలానే పెద్ది టీం మరిన్ని మైలురాయి లను అందుకోవాలని తన బ్లెస్సింగ్స్ మెగాస్టార్ అందించడం జరిగింది.

Exit mobile version