అది ‘ది రాజా సాబ్’ రిలీజ్ అప్ డేట్ ?

Raja Saab Article

కమర్షియల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక మేజర్ అప్‌ డేట్ రెండు వారాల్లో వస్తుందని దర్శకుడు మారుతి రీసెంట్ గానే తెలిపిన సంగతి తెలిసిందే. ఆ అప్ డేట్ ఏమిటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో, ఈ చిత్రం డిసెంబర్ 5న, 2025న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా టీజర్ మాత్రం త్వరలో విడుదల కానుంది. టీజర్ విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వొచ్చు. ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్విరామంగా జరుగుతుంది.

Exit mobile version