అల్లు అర్జున్ కోసం ఐకానిక్ టైటిల్ పట్టుకొస్తున్న అట్లీ..?

AAA22 1

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు అట్లీతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రపై ఇప్పటికే సినీ సర్కిల్స్‌లో పలు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పై కూడా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వినిపిస్తోంది. ఈ సినిమాకు పలు టైటిల్స్ పరిశీలించిన అట్లీ, ‘ఐకాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. గతంలో ఇదే టైటిల్‌లో అల్లు అర్జున్ ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ టైటిల్‌పై వార్తలు వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ అవుతుంది.

మరి నిజంగానే అల్లు అర్జున్ కోసం అట్లీ ఈ టైటిల్‌ను ఫిక్స్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనుంది.

Exit mobile version