ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ముందే రికార్డులపై కన్నేసిన ‘కూలీ’!

Coolie m e1728737620148

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ కోసం ప్రేక్షకులు, అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో రజినీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమా కోసం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీగా ఆసక్తి నెలకొంది.

దీంతో ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ సినిమాపై నెలకొన్ని అంచనాలతో ఈ చిత్రం రైట్స్ దక్కించుకునేందుకు భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయట. ఏకంగా రూ.80 కోట్ల మేర ఓవర్సీస్ రైట్స్ కోసం ఆఫర్స్ వచ్చాయంటే ‘కూలీ’ మేనియ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ విషయంలో మేకర్స్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. ఈ చిత్రాన్ని భారీ స్కేల్‌లో రిలీజ్ చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. దీంతో రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ రికార్డులపై కూలీ కన్నేశాడని అభిమానులు అంటున్నారు.

Exit mobile version