‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ మొదలయ్యేది అప్పుడేనా..?

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రంగా మారింది. గతేడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులకు చిన్న విరామం లభించింది. దర్శకుడు సందీప్ వంగా నటీనటుల ఎంపిక మరియు ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉండటమే ఈ విరామానికి ప్రధాన కారణం.

మరోవైపు ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టులైన ‘ఫౌజీ’, ‘కల్కి 2898 AD: పార్ట్ 2’ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ ఒక సరికొత్త మేకోవర్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన తన ఫిజిక్‌ను మరింత ఫిట్‌గా, ఇంటెన్స్‌గా మార్చుకునే పనిలో ఉన్నాడు.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ 2026 మే మొదటి వారంలో ప్రారంభం కానుంది. అప్పటి నుండి ఎటువంటి బ్రేక్ లేకుండా షూటింగ్ జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Exit mobile version