Jana Nayagan: విజయ్ బర్త్ డే ట్రీట్.. అదిరిపోయిన ‘జన నాయగన్’ ఫస్ట్ రోర్

Jana Nayagan

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి విజయ్ బర్త్ డే ట్రీట్ గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

జన నాయగన్ ఫస్ట్ రోర్ అంటూ వచ్చిన ఈ ట్రీట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ ఎంట్రీ మోత మోగించింది. ఆయన చేతిలో కత్తి పట్టుకుని స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తుంటే.. అనిరుధ్ బీజీమ్ మరింత పవర్ఫుల్ గా చేసింది. మొత్తానికి దళపతి విజయ్ బర్త్ డే ట్రీట్ సాలిడ్ గా ఉంది అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version