సాలిడ్ వసూళ్లు, బుకింగ్స్ తో ‘విష్ణు విన్యాసం’.. 2 రోజుల్లో ఎంతంటే

Vishnu Vinyasham

ప్రెజెంట్ టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకుడు ఎదునాథ్ మారుతీ రావు తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “విష్ణు విన్యాసం”. ఒకింత రొటీన్ కాన్సెప్ట్ తోనే వచ్చిన ఈ చిత్రం శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఫుల్ చేసి థియేటర్స్ కి ఆడియెన్స్ ని రప్పిస్తున్నాడు. ఇక మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకోగా డే 2 కూడా మంచి నంబర్స్ రాబట్టి రెండు రోజుల్లో 9.1 కోట్ల గ్రాస్ ని అందుకుంది.

మొదటి రోజు సుమారు 4 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ అందుకోగా డే 2 కి మరో కోటి గ్రాస్ కి పైగా రాబట్టి 5 కోట్ల గ్రాస్ తో 9 కోట్లకి పైగా అందుకోవడం విశేషం. పైగా గత 24 గంటల్లో బుకింగ్స్ కూడా ఇటీవల వచ్చిన చాలా చిత్రాల కంటే బెటర్ గా అందుకోవడం జరిగింది. ఇక మూడో రోజు ఆదివారం హాలిడే మరో అడ్వాంటేజ్ అవుతుంది. ఇక ఈ మూడో రోజు ఎంత రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించగా సుమంత్ నాయుడు జి నిర్మాణం వహించారు.

Exit mobile version