“ప్రేమిస్తున్నా” సినిమాకు విజయ్ సేతుపతి సపోర్ట్ – “ఎవరే నువ్వు” సాంగ్ లాంచ్!

Evare Nuvvu song f

భాను దర్శకత్వంలో, కనకదుర్గారావు పప్పుల నిర్మాణంలో, వరలక్ష్మీ పప్పుల సమర్పణలో వస్తున్న సరికొత్త ప్రేమకథా చిత్రం “ప్రేమిస్తున్నా”. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటించారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి పాట “అరెరె”కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, ఈ చిత్రంలోని రెండో పాట “ఎవరే నువ్వు”ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఒక తెలుగు సినిమా పాటను విజయ్ సేతుపతి లాంచ్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. “ప్రేమిస్తున్నా” సినిమా పెద్ద విజయం సాధించాలని ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “ఎవరే నువ్వు” పాటను పూర్ణ చంద్ర రచించగా, సిద్ధార్థ్ సాలూర్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ, “మా ‘ప్రేమిస్తున్నా’ సినిమా రెండో పాటను విజయ్ సేతుపతి గారు విడుదల చేయడం మా టీమ్‌కు ఎంతో సంతోషాన్నిచ్చింది. మా సినిమా కథ, కథనాలను తెలుసుకున్న ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. చాలా కాలం తర్వాత వస్తున్న ఒక అందమైన ప్రేమకథా చిత్రమిది” అని అన్నారు.

ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందించగా, అనిల్ కుమార్ అచ్చు గట్ల సంభాషణలు రాశారు. మర్రి రవికుమార్ నిర్వహణ, శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు.

Click Here for Video

Exit mobile version